Wednesday, May 15, 2019

ఎంతవరకూ, ఎందుకొరకూ... - 2

ఎంతవరకూ, ఎందుకొరకూ... - 2
లాస్ ఆఫ్ పే అంటే గుండె కలుక్కుమని చెయ్యని తప్పుకి పడ్డ శిక్షలాంటి భావన. ట్రైన్ తో పాటుగా స్పీడ్ గా సాగి పోతున్న ఆలోచన - ఇప్పుడేం చెయ్యాలి, ఎవరిని అడగాలి అని. అడ్మిన్ లో నాకు తెలిసిన ఇద్దరికి ఫోన్ చేశాను. రెస్పాన్స్ లేదు. వాళ్ళ మీటింగ్స్ ఇంకా వర్క్స్ లో వాళ్ళున్నారేమో... ప్రయాణం మొదలులోనే ఏంటిలా జరిగింది అన్న దిగులు. ఇలా ఒక గంట కొనసాగింది. చివరగా ఒక నిర్ణయానికి వచ్చను. ఇలా ట్రైన్ లో కూర్చుని ఆలోచించుకుంటూ దిగులు పడుతూ సాధించేదేమీ లేదు. ఎలాగూ మెసేజ్ ప్రిన్సిపల్ నుంచి వచ్చింది కాబట్టి, ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. తిరిగి హైద్రాబాద్ వెళ్ళాక, కాలేజ్ లో అసలు ఏం జరిగిందో తెలుసుకుని, ఏం చెయ్యాలో ప్లాన్ చేస్కోవడాం బెటర్ ఐడియ. అప్పటి వరకూ, లెట్ మీ ఎంజాయ్ ద ట్రిప్ అని గట్ఠిగా నిర్ణయించేసుకున్నాను.

మ్యూజిక్ మజిక్ లో మునిగి పోయాను. ఇష్టమైన పది పాటలు ప్లే చేసుకుని, హేప్పీ గా నిద్రపోయాను. ఢిల్లీ వచ్చెన్ అని అనౌన్స్మెంట్ రాగానే, మళ్ళీ మొదటి సారి స్కూల్ కి వెళుతున్నంత ఖంగారు తో కూడిన భయం లాంటి ఆనందం. లగేజ్ తీస్కుని స్టేషన్ బైటికి వచ్చాను. పెద్దాడు టెంపరరీ స్టే కోసం ఒక మోటెల్ బుక్ చేసాడు. అక్కడికి వెళ్ళాలి. ఆ అడ్రెస్ కి కాబ్ బుక్ చేసి, నా పక్కన నిలబడిన ఒక మధ్యవయసు మహిళ ని అప్పుడు గమనించాను. ఆవిడ వాళ్ళాయన ని ఏదో అడుగుతోంది. వాళ్ళు కూడా కాబ్ కోసమే వైటింగ్ అనుకుంటా. ఆమె వైపు చూసి పలకరింపుగా నవ్వాను. మనిషి మంచి పొడుగు (ఆడవాళ్ళలో పొడుగు వాళ్ళంటే, ఎందుకో చాలా నచ్చుతుంది నాకు). "మీరు ఢిల్లీ వరకేనా, ఇంకెటైనా వెళ్తున్నారా అని అడిగింది. అవునండీ, ఒక కాంఫరెన్స్ కి హామిర్పుర్ వెళ్ళాలి అన్నాను. అవునా మేము మా పాప ఇంటికి వెళ్ళాలి, మీరేం చదువుకున్నారు అంది, MA in English Literature
, కొంచెం గర్వమే వినిపించిందో ఏమో నాగొంతుల్లో, నేను మెరైన్ ఎంజినీరింగ్ చేశాను గోల్డ్ మెడలిస్ట్ని అంది. అచ్చమైన గృహిణిలా కనిపిస్తున్న ఆవిడ చెప్పిన మాటలు విని షాకయ్యాను. అదేంటండి మరి ఎక్కడా జాయిన్ అవ్వలేదా, ఏం జాబ్ చెయ్యలేదా అన్నాను. వాళ్ళాయన వంక ఒక చూపు చూసి, లేదమ్మా, ఆ రోజులు వేరు, ఇప్పట్లా కాదు అంది. వాళ్ళాయన నాలుగడుగులు దూరం జరిగి ఫోన్ లో మాట్లాడుకుంటూ హడావిడిగా బిజీ అయిపోయాడు. ఆమెని చూస్తూ ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి. అంత చదువుకుని, ఆ స్థాయి ని సాధించి కేవలం ఇంటివరకూ పరిమితం అవ్వడానికి ఎంత క్షోభ పడివుంటుందో అనిపించింది. ఈ లోగా వాళ్ళ కాబ్ వచ్చేసింది. బై బై చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ వెనకే నా కాబ్ వచ్చింది.
ప్రయాణం అంటే ఎప్పుడూ ఒక ఎగ్జైట్మెంట్ లోపలి పొరల్లో మట్టిలో చెమ్మలా కమ్మని సువాసనిస్తుంది. ఆరునెలలకి ఒక సారైన ఒక కొత్త ప్రదేశం చూసి రావాలి. లేకపోతే ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీల్ వుంటుంది.

ప్రయాణం అంటే ఎప్పుడూ ఒక ఎగ్జైట్మెంట్ లోపలి పొరల్లో మట్టిలో చెమ్మలా కమ్మని సువాసనిస్తుంది. ఆరునెలలకి ఒక సారైన ఒక కొత్త ప్రదేశం చూసి రావాలి. లేకపోతే ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీల్ వుంటుంది. నా పట్ల నాకు పెరిగిన బాధ్యతని గుర్తు చేసుకుంటూ, ఫేస్ బుక్ వాట్సాప్ మెసేజ్ ల జోలికి వెళ్ళకుండా, చుట్టూ చూస్తూ, రాజధాని నగరం లోని విపరీతమైన దూరాలు, దుమ్మూ చూస్తూ, పెద్దాడికి చల్ల్ చేసి ప్లేస్ కంఫర్మ్ చేసుకున్నాను. చిన్న సందులాంటి మెట్ల మీదుగా వెళితె, కప్స్యూల్స్ లాంటి గదులున్నాయి. అందులో కంపార్ట్మెంట్స్ లాంటి స్లీపర్ బెర్తులు, లేడిస్ జెంట్స్ తేడా లేని వాష్ రూంస్. చల్లని నీళ్ళు. ఒక్క నిముషం ఏమీ అర్థం కాలేదు. వేడి నీళ్ళకు అలవాటు పడ్డ ప్రాణం. దేవుడా జీవుడా అనుకుంటూ పనులు కానిచ్చి, నైట్ కి హమిర్పుర్ వెళ్ళే బస్ కోసం వైట్ చేస్తుంటే, ఆపద్బాంధవురాలి లా ఫోన్ మోగింది. దేవతలా ఢిల్లీ లో సెటిల్ అయిన ఫ్రెండ్ నుంచీ వచ్చిన ఫోన్ కాల్ అది. వాట్సాప్లో నేను రెండు రొజుల క్రితం పెట్టిన మెసేజ్ చూస్కుని, నువ్వెక్కడున్నా ఇమ్మీడియెట్ గా బైల్దేరి ఇంటికి వచ్చేయమని గొడవ చేసింది. అంతే, రెండో నిమిషం లో కబ్ మాట్లాఏస్కుని వాళ్ళింట్లో వాలి పోయాను. కబుర్లూ షాపింగ్ చపతీలు రాజ్మా కర్రీలు అన్నీ అయ్యాక బస్ డిపో దగ్గర నన్ను దింపేసి వెళ్ళి పోయింది. నా ఢిల్లీ దేవత ని ఎప్పుడు తలుచుకున్నా బోలెడు థాంక్స్ చెప్పుకుంటాను. ఇప్పటి జెనరేషన్ ఈజీ గా తీసుకునేవి, నాకింకా అలవాటు చేసుకోలేనివే. ఈ ఎపిసోడ్ అది పెర్ఫెక్ట్ గా ప్రూవ్ చేసింది.

ఆ రోజు పౌర్ణమి,రాత్రి పదింటికి స్టార్ట్ అయ్యింది. ఏసీ బస్, డ్రైవర్ వెనకాల విండో సీట్. ఆల్మోస్ట్ బైటి రోడ్డంతా కనిపించేలా వీలున్న గ్లాస్ విండోస్. ప్రయాణం లో మరో ముఖ్య విషయం ఏమిటంటే, దాదాపు సెల్ ఫోన్ బాగ్ లో పెట్టేస్తాను. ప్రతి ప్రదేశానికి, అక్కడి ప్రత్యేకతలుగా వుండే చెట్లూ, మట్టి, గాలి, మనుషుల సంభాషణలు గమనించడం ఒక తప్పని సరి అలవాటుగా వున్నప్పుడే ఆ ప్రయాణం మనకు అందించే అనుభవం పరిపూర్ణం అవుతుందని నా నమ్మక. ఢిల్లీ నుంచి బైట పడటానికి దాదాపు గంట సమయం పట్టీంది. అప్పటికి రాత్రి పదకొండు అయ్యింది. నెమ్మదిగా మోబైల్ తీసి పాటలు పెట్టి, ఇయర్ ఫోన్స్ చెవుల్లోకి దూర్చాను. నిద్ర రావడం లేదు. వెన్నెల కొద్దిగా నీడాలా కనిపిస్తున్న రోడ్డు. సమతలం నుంచి ఎత్తు పెరుగుతున్న రోడ్డు. ఘాట్ రోడ్డులా వంపులు తిరుగుతూ పోతుంటే, చాకచక్యంగా స్టీరింగ్ వీల్ ని తిప్పుతూ డ్రైవరూ క్లీనరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వెన్నెల వెలుగులో చెట్లు ఆక్రుతుల్ని మార్చుకుంటున్నాయి. రోడ్డు ఎత్తు పెరిగి, కిటికీ లోంచి లోయలా అనిపిస్తున్న బాహ్య ప్రపంచం. రాత్రి పన్నెండు తరువాత కొంచెం కునుకు పట్టింది. ఎంత టైం గడిచిందో తెలీదు గానీ, ఎవరో లేపినట్టు, హఠాత్తుగా మెలకువ వచ్చింది. కిటికీ లోంచి యథాలాపం గా బైటికి చూసిన నాకు గుండె గొంతుకలోకి తన్నుకొచ్చినట్టైంది.

నేలా నింగీ తేడా లేకుండా ధారగా కురుస్తున్న వెండి వెన్నెల. దేవతా వృక్షాల్లా మెరిసిపోతున్న ధవళ పత్రాల సోయగాలు. వెన్నెల ధూళికి మురిసిపోతున్న ప్రకృతి ఆకృతి. ఏవిటీ అందం.... అందం కాదు అనంతమైన అనుభవం. పదాల్లో ఇమడని కాలం అది.

రోడ్డు ఒక కొన నుంచి మొదలై, రెండో మలుపు చేరే సరికి పొడుగ్గా దట్టమైన చెట్లు అడ్డమొచ్చే వరకూ ఏక ధాటిగా ప్రవహించిన సౌందర్యం. మూడో మలుపు దగ్గర పూర్తిగా మాయమైంది. వర్డ్స్ వర్త్ రాసిన డాఫోడిల్స్ కూడా అలాంటి అద్భుతమే కావొచ్చు. కళ్ళు మూసినా అదే అమృత ధార. బహుశా ఈ ప్రయాణపు రహస్యం ఈ వెన్నెల వానేనేమో... Unforgettable Hamirpur, NIIT campus

@ Delhi Railway station


The mornign mist at NIIT Hamirpur campus from our hostel windo

Trees are well kept in the campus

Another scenic view of the Sun

With the participants of the seminar

sumptous breakfast with aloo parathas, pickle and a dash of coffee

Rose adds that beauty 

July flowers in september

Some more participants

The last day proceedings

all in smiles



No comments:

Post a Comment

ఎంతవరకూ, ఎందుకొరకూ...3

ఎంతవరకూ, ఎందుకొరకూ...3   ప్రయాణమంటే మనలో ఇంత ఉత్సాహమెందుకు... ఇంత ఆకాంక్షా ఆసక్తులెందుకు... మనలోని అంతర్గత ఆదిమ నాడులు ఉత్తే...