Thursday, May 30, 2019

ఎంతవరకూ, ఎందుకొరకూ...3


ఎంతవరకూ, ఎందుకొరకూ...3
 
ప్రయాణమంటే మనలో ఇంత ఉత్సాహమెందుకు...
ఇంత ఆకాంక్షా ఆసక్తులెందుకు...
మనలోని అంతర్గత ఆదిమ నాడులు ఉత్తేజితం అవుతాయేమో... మన జన్యువుల్లో అణిగివున్న ఒక నాటి ఆదిమ సంచార జాతి నిద్ర లేస్తారేమో... అందుకే దూర ప్రయాణాలూ, అజ్ఞాత ప్రదేశాల ప్రయాణాలంటే కొంత ఎక్కువ మక్కువ, 
 
To be honest...

హమిర్పూర్ జర్నీ నాకు చాలా పాఠాలు నేర్పింది. ప్రకృతి పరమార్థాన్ని అలవోకగా ఆవిష్కరించిన ఆ సన్నివేశం ఎప్పుడు తలుచుకున్నా, అదే గగుర్పాటు, అదే తాదాత్మ్యతా, అదే పరవశం నాకు. అక్కడి సెమినార్ వివరాల్లో పెద్దగా చెప్పుకోతగినవి ఏమీ లేవు. కానీ, ఇంగ్లీష్ టీచింగ్ పర్సన్ గా కళ్ళు తెరిపించిన విషయం ఒకటి వుంది. అక్కడ నాకు ప్రియా అనే ఫాకల్టీ తో పరిచయం అయ్యింది. ఆ అమ్మాయి పంజాబీ, పిహెచ్ డీ సబ్మిట్ చేసింది. ఇక్కడ హమిర్పుర్ ణీఈట్ లొ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇంగ్లీష్ ఫాకల్టీ గా పని చేస్తొంది. లంచ్ టైం లో అక్కడ వర్క్ నేచర్ గురించి చిన్న డిస్కషన్ జరిగింది మా ఇద్దరికీ. అక్కడ చేరే పిల్లల స్వభావం గురించి చెప్తూ, కొంత గ్రామాల స్థాయి నుంచి వచ్చిన పిల్లలు, ఇక్కడి రెఫైండ్ స్టూడెంట్స్ కి భయపడి వెనక్కి వెళ్ళిపోవాలనుకోవడం, ఒక ఫాకల్టీ గా అందులోనూ లాంగ్వేజ్ ఫాకల్టీ గా వాళ్ళకి ధైర్యం చెప్పడం (ఇది ప్రతి చోటా లాంగ్వేజ్ ఫాకల్టీకి అందుబాటులో వుండే విషయమే, కొంత దుర్వినియోగం చేసే వాళ్ళని కూడా చూశాను).

సెంట్రల్లీ ఫండెడ్ సంస్థ కనుక అక్కడ కంప్యూటర్లు, సాఫ్ట్ వేర్ అప్ డేటెడ్ గా వుంటయి అని అనుకున్నాను. అదే మాట తనని అడిగాను. అప్పుడు తను చెప్పినది విని మైండ్ బ్లాంక్ అయ్యింది. గవర్నమెంట్ ఆఫీసుల్లో వాడేసి పడేసిన బీసీ కాలం నాటి సిస్టంస్ ని ఇక్కడికి పంపిస్తారు, లాబ్ లో వుండే ముప్ఫై కంప్యూటర్స్ లో ఐదో ఆరో పని చేసే కండిషన్ లో వుంటాయట, ఇక గుంపుగా ఆరేడుగురు స్టూడెంట్స్ ఒక్కో సిస్టం లో ఆడియో వీడియో ఆక్టివిటీస్ చూసుకోవాలి.

ఈ మాటలు విన్నాక ఆ NIIT మీద వున్న ఇంప్రెషనంతా గాలికి కొట్టుకుపోయింది. ఇక్కడ మా కాలేజ్ లో Language Lab lO Del Systems, updated headphones, Activity lab lO LED Tv with internet లో మేము చేసే టీచింగ్ MIT స్థాయిలో వున్నట్టుగా ఫీల్ అయ్యాను. (సొంత డబ్బా అప్పుడప్పుడు మంచిదే :)

:)

అఫ్ కోర్స్, యే వస్తువు కొనాలన్నా దానివెనుక వుండే అడ్మినిస్టీరియల్ ప్రొసీజర్ వ్యక్తుల్లోని క్రియేటివితీని చంపెయ్యడానికే ఉపయోగపడుతుందని మన అందరికి తెలిసిన విషయమే. కాకపోతే అక్కడ కాంపస్ లో అందమైన చెట్లు, ఆకాశమూ పొగమంచూ ఉదయ సంధ్యల్లో ని వెలుగుల విన్యాసాలూ - అక్కడ వున్న మూడు రోజుల్లో నాకు అత్యంత ఆప్తులైపోయాయి.

ఈ ప్రయాణం నుంచి నేను నేర్చుకున్న పాఠాలూ, నాకు నేను విధించుకున్న రూల్స్ ఇవీ:

1. ఒక గుంపుగా ప్రయాణించడం లో వుండే సౌలభ్యాలు ఎక్కువ. కానీ, ఒంటరిగా ప్రయాణించడంలో ఒక అంతర్గత మెలకువ నిద్ర లేస్తుంది. మన మీద మనకి బాధ్యత పెరుగుతుంది. We become more conscious of keeping our tickets, key documents, money, debit card, luggage etc. మన తోటి ప్రయాణీకుల్ని గమనిచడం, వాళ్ళ ప్రవర్తనా సరళి గమనించడమే కాకుండా, మన లోని కొత్త వ్యక్తిత్వ కోణాలూ, ధైర్యాలూ, భయాలూ మనకు పరిచయమవుతాయి.

2. ప్రయాణం లో బస్/ట్రైన్/ఫ్లైట్ ఏదైనా....ప్రయాణ సాధనాలే. కానీ బస్ ఇంకా ట్రైన్ లో ప్రయాణం ఎక్కువ ఇష్టం. మన గమ్య స్థానం చేరే లోగా రకరకాల రాష్ట్రాలూ, గ్రమాలూ దాటుకుంటూ, భౌగోళిక పరిథి లోని ప్రకృతిని ఆవిష్కరిస్తాయి. వీచే గాలి లో పరిమళాన్ని పరిచయ్మ్ చేస్తాయి. అదే ఫ్లైట్ లో ప్రయాణం ఐతే ఒక సరళరేఖ లాంటిది. ఒకే సారి కొత్త ప్రదేశం లో పడేసి ఇక మీ ఆట మీరు ఆడుకోండి అని చెప్తుంది. :)

3. మన సెన్సెస్ షార్ప్  అవ్వాలి. మనం బైల్దేరిన ప్రదేశం లోని మనుషులూ, అలవాట్లూ, అవసరాలూ కొంత అర్థం చేసుకుని వుండటం మంచిది.అప్పుడే కొత్త ప్రదేశానికి వెళ్ళీనప్పుడు అక్కడి మనుషుల వ్యవహార శైలి, ఆహారపు అలవాట్లూ, ఇంకా భౌగోళిక వ్యత్యాసాలు సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. మన ఆలోచనా పరిథి విస్తృతం అవుతుంది.

4. దూర ప్రయాణాలు అక్కడి వ్యక్తులతో పరిచయాల వలన -  మన దగ్గర ఇలా చెయ్యరు, వీళ్ళెలా తింటారో ఈ ఫుడ్స్, వీళ్ళెలా వుంటారలాగా... ఇలాంటి ఫ్రేంస్ నుంచి బైటికి రావడం తేలిక.

 






 

Wednesday, May 15, 2019

ఎంతవరకూ, ఎందుకొరకూ... - 2

ఎంతవరకూ, ఎందుకొరకూ... - 2
లాస్ ఆఫ్ పే అంటే గుండె కలుక్కుమని చెయ్యని తప్పుకి పడ్డ శిక్షలాంటి భావన. ట్రైన్ తో పాటుగా స్పీడ్ గా సాగి పోతున్న ఆలోచన - ఇప్పుడేం చెయ్యాలి, ఎవరిని అడగాలి అని. అడ్మిన్ లో నాకు తెలిసిన ఇద్దరికి ఫోన్ చేశాను. రెస్పాన్స్ లేదు. వాళ్ళ మీటింగ్స్ ఇంకా వర్క్స్ లో వాళ్ళున్నారేమో... ప్రయాణం మొదలులోనే ఏంటిలా జరిగింది అన్న దిగులు. ఇలా ఒక గంట కొనసాగింది. చివరగా ఒక నిర్ణయానికి వచ్చను. ఇలా ట్రైన్ లో కూర్చుని ఆలోచించుకుంటూ దిగులు పడుతూ సాధించేదేమీ లేదు. ఎలాగూ మెసేజ్ ప్రిన్సిపల్ నుంచి వచ్చింది కాబట్టి, ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. తిరిగి హైద్రాబాద్ వెళ్ళాక, కాలేజ్ లో అసలు ఏం జరిగిందో తెలుసుకుని, ఏం చెయ్యాలో ప్లాన్ చేస్కోవడాం బెటర్ ఐడియ. అప్పటి వరకూ, లెట్ మీ ఎంజాయ్ ద ట్రిప్ అని గట్ఠిగా నిర్ణయించేసుకున్నాను.

మ్యూజిక్ మజిక్ లో మునిగి పోయాను. ఇష్టమైన పది పాటలు ప్లే చేసుకుని, హేప్పీ గా నిద్రపోయాను. ఢిల్లీ వచ్చెన్ అని అనౌన్స్మెంట్ రాగానే, మళ్ళీ మొదటి సారి స్కూల్ కి వెళుతున్నంత ఖంగారు తో కూడిన భయం లాంటి ఆనందం. లగేజ్ తీస్కుని స్టేషన్ బైటికి వచ్చాను. పెద్దాడు టెంపరరీ స్టే కోసం ఒక మోటెల్ బుక్ చేసాడు. అక్కడికి వెళ్ళాలి. ఆ అడ్రెస్ కి కాబ్ బుక్ చేసి, నా పక్కన నిలబడిన ఒక మధ్యవయసు మహిళ ని అప్పుడు గమనించాను. ఆవిడ వాళ్ళాయన ని ఏదో అడుగుతోంది. వాళ్ళు కూడా కాబ్ కోసమే వైటింగ్ అనుకుంటా. ఆమె వైపు చూసి పలకరింపుగా నవ్వాను. మనిషి మంచి పొడుగు (ఆడవాళ్ళలో పొడుగు వాళ్ళంటే, ఎందుకో చాలా నచ్చుతుంది నాకు). "మీరు ఢిల్లీ వరకేనా, ఇంకెటైనా వెళ్తున్నారా అని అడిగింది. అవునండీ, ఒక కాంఫరెన్స్ కి హామిర్పుర్ వెళ్ళాలి అన్నాను. అవునా మేము మా పాప ఇంటికి వెళ్ళాలి, మీరేం చదువుకున్నారు అంది, MA in English Literature
, కొంచెం గర్వమే వినిపించిందో ఏమో నాగొంతుల్లో, నేను మెరైన్ ఎంజినీరింగ్ చేశాను గోల్డ్ మెడలిస్ట్ని అంది. అచ్చమైన గృహిణిలా కనిపిస్తున్న ఆవిడ చెప్పిన మాటలు విని షాకయ్యాను. అదేంటండి మరి ఎక్కడా జాయిన్ అవ్వలేదా, ఏం జాబ్ చెయ్యలేదా అన్నాను. వాళ్ళాయన వంక ఒక చూపు చూసి, లేదమ్మా, ఆ రోజులు వేరు, ఇప్పట్లా కాదు అంది. వాళ్ళాయన నాలుగడుగులు దూరం జరిగి ఫోన్ లో మాట్లాడుకుంటూ హడావిడిగా బిజీ అయిపోయాడు. ఆమెని చూస్తూ ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి. అంత చదువుకుని, ఆ స్థాయి ని సాధించి కేవలం ఇంటివరకూ పరిమితం అవ్వడానికి ఎంత క్షోభ పడివుంటుందో అనిపించింది. ఈ లోగా వాళ్ళ కాబ్ వచ్చేసింది. బై బై చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ వెనకే నా కాబ్ వచ్చింది.
ప్రయాణం అంటే ఎప్పుడూ ఒక ఎగ్జైట్మెంట్ లోపలి పొరల్లో మట్టిలో చెమ్మలా కమ్మని సువాసనిస్తుంది. ఆరునెలలకి ఒక సారైన ఒక కొత్త ప్రదేశం చూసి రావాలి. లేకపోతే ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీల్ వుంటుంది.

ప్రయాణం అంటే ఎప్పుడూ ఒక ఎగ్జైట్మెంట్ లోపలి పొరల్లో మట్టిలో చెమ్మలా కమ్మని సువాసనిస్తుంది. ఆరునెలలకి ఒక సారైన ఒక కొత్త ప్రదేశం చూసి రావాలి. లేకపోతే ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీల్ వుంటుంది. నా పట్ల నాకు పెరిగిన బాధ్యతని గుర్తు చేసుకుంటూ, ఫేస్ బుక్ వాట్సాప్ మెసేజ్ ల జోలికి వెళ్ళకుండా, చుట్టూ చూస్తూ, రాజధాని నగరం లోని విపరీతమైన దూరాలు, దుమ్మూ చూస్తూ, పెద్దాడికి చల్ల్ చేసి ప్లేస్ కంఫర్మ్ చేసుకున్నాను. చిన్న సందులాంటి మెట్ల మీదుగా వెళితె, కప్స్యూల్స్ లాంటి గదులున్నాయి. అందులో కంపార్ట్మెంట్స్ లాంటి స్లీపర్ బెర్తులు, లేడిస్ జెంట్స్ తేడా లేని వాష్ రూంస్. చల్లని నీళ్ళు. ఒక్క నిముషం ఏమీ అర్థం కాలేదు. వేడి నీళ్ళకు అలవాటు పడ్డ ప్రాణం. దేవుడా జీవుడా అనుకుంటూ పనులు కానిచ్చి, నైట్ కి హమిర్పుర్ వెళ్ళే బస్ కోసం వైట్ చేస్తుంటే, ఆపద్బాంధవురాలి లా ఫోన్ మోగింది. దేవతలా ఢిల్లీ లో సెటిల్ అయిన ఫ్రెండ్ నుంచీ వచ్చిన ఫోన్ కాల్ అది. వాట్సాప్లో నేను రెండు రొజుల క్రితం పెట్టిన మెసేజ్ చూస్కుని, నువ్వెక్కడున్నా ఇమ్మీడియెట్ గా బైల్దేరి ఇంటికి వచ్చేయమని గొడవ చేసింది. అంతే, రెండో నిమిషం లో కబ్ మాట్లాఏస్కుని వాళ్ళింట్లో వాలి పోయాను. కబుర్లూ షాపింగ్ చపతీలు రాజ్మా కర్రీలు అన్నీ అయ్యాక బస్ డిపో దగ్గర నన్ను దింపేసి వెళ్ళి పోయింది. నా ఢిల్లీ దేవత ని ఎప్పుడు తలుచుకున్నా బోలెడు థాంక్స్ చెప్పుకుంటాను. ఇప్పటి జెనరేషన్ ఈజీ గా తీసుకునేవి, నాకింకా అలవాటు చేసుకోలేనివే. ఈ ఎపిసోడ్ అది పెర్ఫెక్ట్ గా ప్రూవ్ చేసింది.

ఆ రోజు పౌర్ణమి,రాత్రి పదింటికి స్టార్ట్ అయ్యింది. ఏసీ బస్, డ్రైవర్ వెనకాల విండో సీట్. ఆల్మోస్ట్ బైటి రోడ్డంతా కనిపించేలా వీలున్న గ్లాస్ విండోస్. ప్రయాణం లో మరో ముఖ్య విషయం ఏమిటంటే, దాదాపు సెల్ ఫోన్ బాగ్ లో పెట్టేస్తాను. ప్రతి ప్రదేశానికి, అక్కడి ప్రత్యేకతలుగా వుండే చెట్లూ, మట్టి, గాలి, మనుషుల సంభాషణలు గమనించడం ఒక తప్పని సరి అలవాటుగా వున్నప్పుడే ఆ ప్రయాణం మనకు అందించే అనుభవం పరిపూర్ణం అవుతుందని నా నమ్మక. ఢిల్లీ నుంచి బైట పడటానికి దాదాపు గంట సమయం పట్టీంది. అప్పటికి రాత్రి పదకొండు అయ్యింది. నెమ్మదిగా మోబైల్ తీసి పాటలు పెట్టి, ఇయర్ ఫోన్స్ చెవుల్లోకి దూర్చాను. నిద్ర రావడం లేదు. వెన్నెల కొద్దిగా నీడాలా కనిపిస్తున్న రోడ్డు. సమతలం నుంచి ఎత్తు పెరుగుతున్న రోడ్డు. ఘాట్ రోడ్డులా వంపులు తిరుగుతూ పోతుంటే, చాకచక్యంగా స్టీరింగ్ వీల్ ని తిప్పుతూ డ్రైవరూ క్లీనరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వెన్నెల వెలుగులో చెట్లు ఆక్రుతుల్ని మార్చుకుంటున్నాయి. రోడ్డు ఎత్తు పెరిగి, కిటికీ లోంచి లోయలా అనిపిస్తున్న బాహ్య ప్రపంచం. రాత్రి పన్నెండు తరువాత కొంచెం కునుకు పట్టింది. ఎంత టైం గడిచిందో తెలీదు గానీ, ఎవరో లేపినట్టు, హఠాత్తుగా మెలకువ వచ్చింది. కిటికీ లోంచి యథాలాపం గా బైటికి చూసిన నాకు గుండె గొంతుకలోకి తన్నుకొచ్చినట్టైంది.

నేలా నింగీ తేడా లేకుండా ధారగా కురుస్తున్న వెండి వెన్నెల. దేవతా వృక్షాల్లా మెరిసిపోతున్న ధవళ పత్రాల సోయగాలు. వెన్నెల ధూళికి మురిసిపోతున్న ప్రకృతి ఆకృతి. ఏవిటీ అందం.... అందం కాదు అనంతమైన అనుభవం. పదాల్లో ఇమడని కాలం అది.

రోడ్డు ఒక కొన నుంచి మొదలై, రెండో మలుపు చేరే సరికి పొడుగ్గా దట్టమైన చెట్లు అడ్డమొచ్చే వరకూ ఏక ధాటిగా ప్రవహించిన సౌందర్యం. మూడో మలుపు దగ్గర పూర్తిగా మాయమైంది. వర్డ్స్ వర్త్ రాసిన డాఫోడిల్స్ కూడా అలాంటి అద్భుతమే కావొచ్చు. కళ్ళు మూసినా అదే అమృత ధార. బహుశా ఈ ప్రయాణపు రహస్యం ఈ వెన్నెల వానేనేమో... Unforgettable Hamirpur, NIIT campus

@ Delhi Railway station


The mornign mist at NIIT Hamirpur campus from our hostel windo

Trees are well kept in the campus

Another scenic view of the Sun

With the participants of the seminar

sumptous breakfast with aloo parathas, pickle and a dash of coffee

Rose adds that beauty 

July flowers in september

Some more participants

The last day proceedings

all in smiles



Saturday, May 11, 2019

ఎంత వరకూ... ఎందు కొరకూ....1


ఎంత వరకూ... ఎందు కొరకూ....1
ప్రయాణం అన్నది ఒక ఏకాంత వాసం కావాలి. డైలీ లైఫ్ నుండి ప్రక్కకి నెడుతూ, ఉదయాస్తమానాల నడుమ కొత్త గా కుట్టిన లేసు తళుకుల్లాంటి క్షణాల్ని జీవితానికివ్వాలి. అప్పుడే ప్రయాణం అంటే ఆ పదం లోనే ఒక ఆసక్తి, ఎనర్జీ, ఎగ్జైట్మెంట్ కలగలిపిన సముద్రం ఒడ్డున నిలబడి చూసే ఫీల్. ప్రయాణమంటే మనకి మనం ప్రేమించుకోవడానికి ఇచ్చే సుందర అవకాశం. ప్రయాణం అంటే కాలం హఠాత్తుగా కవర్లో పెట్టిచ్చే బ్లాంక్ చెక్. ఇక్కడ ముఖ్య ఉద్దేశ్యం సకుటుంబ సపరివార సమేతం కాకుండా, ఒక ఇండివిడ్యువల్ గా సొంత నిర్ణయంతో ఇష్టంతో నిశ్చయించుకున్న ప్రదేశాన్ని చూసిరావడం అన్నదే ప్రయాణం అన్న పదానికి అర్థం.

కుటుంబం తో జర్నీ అన్నది తప్పేమీ కాదు. అందులో ఒక జెనరల్ సెక్యూరిటీ, ఒక బాధ్యత, ఇంట్లో ఎలాంటి ఆలోచనా ధార నడుస్తుందో, ఈ ప్రయాణం లోనూ దాదాపు అంతే జరుగుతుంది. టిఫిన్స్ పాక్ చేసావా, సూట్ కేసులో బట్టలు అన్నీ సర్దావా, టూత్ బ్రష్ పెట్టావా, టంగ్ క్లీనర్ మర్చిపోయావ్ కదా, ఇంటి తాళాలు ఎక్కడ పెట్టావ్, అన్ని గదులూ లాక్ చేశావా... ఇలా ఏక పక్ష లోక్ సభలాంటి ప్రశ్నలు అయ్యాక, ట్రైనెక్కి కూర్చుని హమ్మయ్యా అనుకునే లోగా, రెండు స్టేషన్లు దాటగానే, ఎవరో ఒకళ్ళకి ఆకలి గుర్తొస్తుంది, లేదా స్నాక్స్ తినాలనిపిస్తుంది. మళ్ళీ బ్యాగ్స్ వెతుక్కొని సర్వింగ్ మొదలు. మాటా మంతీ సాగుతుంది. లెక్కపెట్టుకున్న దూరానికి రైలు చేరాకా అందరూ హోటల్ చేరి చూడాలనుకున్న ప్లేసెస్ కి కార్ మాట్లాడుకొని, గబ గబా చూసేసి, నాలుగు సెల్ఫీలు, పది గ్రూప్ ఫొటోలుగా ట్రిప్ ముగించుకుని ఇంటికి వచ్చేస్తాం. ద టూర్ వాస్ ఆస్సం నా... అఫ్ కోర్స్... కానీ మనలో ఏం జరిగింది? బాహ్యం నుంచి ఇహం నుంచి అహం ఏం మార్పులు చేసుకుంది? అసలు అలాంటి అవకాశం ఇవ్వగలిగే విషయమేనా... 

కొన్ని ప్లేసెస్ మనతో ఏవో గుసగుసలాడతాయి. కొన్ని సమూహాల్లోంచి మాయమవ్వలనిపిస్తుంది. కొన్ని అలవాట్లను చేదించి ఔటాఫ్ బాక్స్ అవ్వలనిపిస్తుంది. అందులోని అభద్రతే మనలను మరింత జాగరూకుల్ని చేస్తుంది. మరింత అందాన్ని ఆస్వాదించేలా అవకాశాల్ని సృష్టిస్తుంది. కొన్ని మార్పులకి చోటివ్వాలంటే కొన్ని అలవాట్లు చేదించాల్సిందే. అలాంటి ఒక మలుపు - ఒంటరి ప్రయాణం. లేదా నాతో భావ సారూప్యమున్న సమూహ ఏకాంతం 

2016 లో మొదటి సారి ఒంటరి గా ప్రయాణం చెయ్యాల్సిందే అని తీర్మానించుకున్న సందర్భం ఒకటి వచ్చింది. Arunachal Pradesh లోని Hamirpur NIITలో పేపర్ PRESENT చెసే అవకాశం వస్తే, నాతో పాటూ పేపర్లు పంపిన మా కొలీగ్స్ అంత దూరం ఎలా వెళ్తాం మేడం? ఇంట్లో విషయాలన్నీ వదిలేసి వెళ్ళడం అంత ఈజీ కాదు కదా... ఇత్యాది ఆలోచనలు వెళ్ళ గక్కాక, ఒక్క దాన్నైనా ఎందుకు వెళ్ళకూడదూ అన్న ఆలోచనే రాజధాని ఎక్స్ప్రెస్స్ ఎక్కించింది. ఆ ప్రయాణం కి టికెట్ అరేంజ్మెంట్స్ అన్నీ పెద్దాడు చూసుకున్నాడు. హైద్రా బాద్ నుండి రాజధాని ఎక్స్ప్రెస్స్ లో ఢిల్లీ వరకూ వెళ్ళడం, అక్కడి నుండి బస్ లో హామిర్పూర్ కి చేరడాం. అక్కడి ప్రొఫెసర్ తో మాట్లాడి రూం అరేంజ్మెంట్ కూడా confirm అయిపోయింది. 


అనుకున్న రోజున మన సికింద్రా బాద్ స్టేషన్ లో రాజధాని ఎక్స్ప్రెస్స్ ఎక్కించి చిన్నాడు జాగ్రత్త మమ్మీ అంటూ చెయ్యూపాడు. నా బెర్త్ చూసుకుని సెటిల్ అయ్యాక, చుట్టూతా ఒక లుక్కేద్దామని వెళితే, ఆల్మోస్ట్ కంపార్ట్మెంట్ అంతా ఖాళీ. బోగీ మొత్తమ్మీద పదిమంది ప్రయాణీకులున్నారు. దారిలో ఎక్కుతారేమోలే అని అనుకుని నా సీట్ కి వచ్చి కూర్చున్నాను. సాయంత్రానికి కూడా జనాభా నుంబర్ లో తేడా లేదు.

ఫుడ్ తీసుకొచ్చిన బాయ్ ని అడిగాను. ఏంటిలా అనీ... వాడు సెలవిచ్చాడు... ఇలా అప్పుడప్పుడు అవుతూనే వుంటుంది. ఇది మామూలే అని అన్నాడు. అప్పటికి రాత్రి డిన్నర్ అయ్యి, వాళ్ళిచ్చిన రగ్ కప్పుకుని పడుకున్నాను. ఆలోచనల స్పీడ్ తప్ప నిద్ర మచ్చుకైనా రాలేదు. పెద్దగా కళ్ళు చేసుకుని, ఏ చప్పుడైనా అటూ ఇటూ చూడటం, టీవీల్లోని నేరాలూ ఘోరాల న్యూస్ ఐటంస్ గుర్తొస్తుంటే, ఇలా కుదరదు అని, ఇయర్ ఫోన్స్ చెవిలోకి దూర్చేసి, మాంచి మ్యూసికల్ హిట్ సాంగ్స్ పెట్టుకుని నిద్ర పోవడానికి ప్రయత్నం చేసా. మోబైల్ లో ఫేస్ బుక్ తిరగెయ్యడం, పిల్లలకి కాల్ చెయ్యడం ఇలా అర్థ రాత్రి దాకా గడిచింది. అప్పటికీ ఆగలేక చిన్నగా కునుకు పట్టేసింది. అయినా మళ్ళీ నా మీద నాకే బాధ్యత ఎక్కువ వుందన్నట్టుగా మధ్యలో మెలకువలూ, సీరియల్ ఎపిసోడ్స్ లా నిద్ర. తెల్లరింది. ఆరింటికల్లా పళ్ళూ తోమి కూర్చుంటే, టీ బ్రేక్ఫాస్ట్ రెడీ.

అదీ అయ్యింది. ఈ లోగా మోబైల్ లో టపా టపా మెసేజ్ ల వర్షం. ఏంటా అని తీసి చూస్తే యువర్ లీవ్ అప్ప్లైడ్ ఇస్ గ్రాంటెడ్ ఆస్ డ్ళోఫ్ అని మూడూ రోజుల లీవ్ కి మూడు రెళ్ళ ఆరు లాసాఫ్ పేస్ అని శుభవార్త.

ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. మైండ్ బ్లాంక్ అయ్యింది. ప్రయాణం మొదలు పెట్టి ఒక రోజు కూడా పూర్తి కాలేదు. డబుల్ లాసాఫ్ పేస్ అంటే ఎవరిని అడగాలి, అసలు ఎందుకు ఇలా జరిగింది, క్లాస్ అడ్జస్ట్మెంత్ సరిగ్గానే చేశాను కదా - రాజధాని ఎక్స్ప్రెస్స్ వేగం తో సమానం గా పరిగెడుతున్నాయి ఆలోచనలు. మా కొలీగ్ కి కాల్ చేసి అడిగితే, నేను కరెక్ట్ గానే లీవ్ ఆక్సెప్ట్ చేశాను మేడం అంటాడాయన. నన్ను నమ్మండి అన్నట్టు. :) పాపం. మరి మిస్టేక్ ఎక్కడ జరిగినట్టు...
(ఇప్పటికి సశేషం)

Monday, August 6, 2018

The Countdown has Begun

Count down has begun... #dialogue_with_diary
 
My stint with literature has begun with amma's anxious reading of Pramadavanam in Andhra Prabha, a telugu magazine that offered the question and answers column written by the great lady writer, Malathi Chandur. She used to make me sit in the kitchen and read them loud as she could continue her work of preparing food for the family. The dried wood gives out flames so fast, that food had to be taken care of else they would turn black in no time.


Malathi Chandur's vast literary quotes lead to some more search and some more reading. Her column pages were torn and stitched together by hand by peddakka.

It was a continuous reading and the thirst too established the place in the increased number of collected pages and books.

Dedicate this first flower to that sweet mother!

Saturday, June 16, 2018

Journey with Dani

 Anil Dani is one poet who expresses in mystified means. The themes he chose also endears the expressions of his poetry. A man of simple ways, his smile endears him to those who dare to make an acquaintance. Dare to - I used, cause, his serious look surely spreads the vibe, approach at your risk. As a poet, he is an endearing soul. His word pictures involve in reality, serves life's cruelty in those lines of elaborated magnanimity.

This poem Godavari Godavari, I find the theme to be engrossing till the last line.
He depicts the greed surrounding the natural abundance as well as suffocated innocence of local tribes. Pain is the universal factor and exploitation is the second reality. Plunge into this imagery to empathise with the drowned realities.



Godavari... Godavari

with the waves you adorn

Tiresome it could have been

How long had you been playing with the shimmering moonlight

How long would you bear the boats that

float sprinkling the lahiri lahiri lyrics

Love thee for
showing your angst
to those romanticists

You are the demon beautified 

Yet ignorant of it

Dear me! your are the saviour for those

who couldn't resist to plod you daily

Though I couldn't find who's the cause
Doubt your capability

Make up you mind and I assure
You could vanish these mothers' angst forever
You may ask how, Dear River Godavari!
Drown those swindlers
who eulogize your beauty to deceit
Wish that might appease the submerged souls



You may ask why...

For we are yet in search

to find whose felony it is

In the name of those sons of soil

who flew bearing the blankets of water

I pray Godavari
For god's sake
Flood the shores!


felony means a crime regarded in the US and many other judicial systems as more serious than a misdemeanour.
******************

గోదావరి.....గోదావరి
అలలతో అలరించి అలరించి
అలసిపొయుంటావు
ఎంతసేపని వెన్నెలతో ఆడుకుంటావు
నీ మీద లాహిరి లాహిరి పాటలు పాడుకుంటూ
తిరుగుతున్న పడవలని ఎంతకాల మోస్తావు 


నిన్ను ఆరాధిస్తూ తిరిగే భావుకులకి
నీ ఉగ్రస్వరూపం చూపినందుకు
నిన్ను నేను ప్రేమిస్తున్నాను 


నీకేం తెలుసు నువ్వొక అందమైన భూతానివి
పాపం వారికే నువ్వు తప్పా దిక్కులేదు
రోజూ నీ మేను మీద కాలు మోపకపొతే
డొక్క నిండదు 


నీ కోపం ఎవరిమీదో అర్ధం కాలెదు కాని
నీ సామర్ధ్యం మీద నాకు అనుమానంగా ఉంది 



నువ్వు తలుచుకుంటే
ఈ రోజు గుండెలవిసేలా రోధిస్తూన్న అమ్మల
ఏడుపులనీ మరలా లేకుండా చేయగలవు


ఎలా అంటావెమో గోదావరి
నీ అందాన్ని చూపిస్తూ మోసం చేస్తున్న
మహామహుల్ని కూడా ముంచెత్తు
అప్పుడైనా ఈ మునిగిపోయిన ప్రాణాలు కాస్త
స్టిమిత పడతాయి


ఎందుకంటే ఇక్కడ నేరం ఎవరిదనే ప్రశ్న కి
సమాధానం మేము ఇంకా వెతుక్కుంటున్నాం
నీటి దుప్పటి కప్పుకుని ఆకాశానికి ఎగిరిపోయిన
ఈ మట్టి మనుషుల సాక్షిగా ఒక్కసారంటే
ఒక్క సారి పొంగు గోదావరి........


*************************

Friday, June 15, 2018

Yearn for a Parley


I wondered many a time, what makes a person translate words that do not belong to him/her. Translation is adopting to the thought flow originated in others and owning it to the minutest of its meaning. How can one see the words close to feel the essence of the words at heart? It never made its best in mind's layers of logic. Some moments beat logic and make their presence felt. REcent publication of this poem
#ఎవరితోనైనమాట్లాడలనివుంటుంది in andhrajyoti triggered that connectivity. An urge to give it my pen grew stronger. After repetitive readings, found the chain of thought in English.

Yearn for a Parley

Like the chirping birds speak with the silence
Like the rainbow speaks to the skies
Akin to the reflection speaks with the pond
Heart wishes to touch anybody with words

I wish to enter the heart of anybody
Through words
Wishes to light the lamp of memory
In the hearts of unknowns too

Who is me, who is not me
Dripping from someone to some others
What are those slithering wordy footsteps

What remained to share in your untenanted words
What could be made of you from those floating words

Minus the skies from the skies
Yet skies are the remnants
Akin to it, however much the self pours you in words
Finally its you, who remains

Perchance, when the words melt in silence
You and others
Wake up, in fact, in each other.
*************
*************
#ఎవరితోనైనమాట్లాడలనివుంటుంది

పక్షి కూత నిశ్శబ్దం తో మాట్లాడినట్లు
ఇంద్ర ధనువు ఆకాశం తో మాట్లాడినట్లు
ప్రతిబింబం కొలనుతో మాట్లాడినట్లు
ఎవరినైనా మాటలతో తాకాలని వుంటుంది

ఎవరి హృదయం లోకైనా
మాటల ద్వారా ప్రవేశించాలని వుంటుంది
ఎవరెవరిలోనో స్మృతి దీపమై వెలగాలని వుంటుంది

నీవెవరివీ, పరులెవరూ
ఎవరినుండి ఎవరిలోకో
మాటల మెత్తటి పదధ్వనులేమిటి

నీలో ఏమి మిగిలిందని మాటలలో పంచాలి
నువ్వు ఏమై మిగలాలని మాటలుగా
ప్రవహించాలి

ఆకాశం నుండి ఆకాశాన్ని తీసివేసినా
ఆకాశమే మిగిలినట్లు
నీనుండి నిన్ను మాటల్లోకి ఒంపినా
నువ్వు నువ్వుగానే మిగులుతావు

బహుశా, మాటలన్నీ మౌనంలో కరిగినప్పుడు
నీవూ, పరులూ
ఒకరిలో కొకరు నిజంగా మేలుకొంటారు.

-- బి.వి.వి.ప్రసాద్

ఎంతవరకూ, ఎందుకొరకూ...3

ఎంతవరకూ, ఎందుకొరకూ...3   ప్రయాణమంటే మనలో ఇంత ఉత్సాహమెందుకు... ఇంత ఆకాంక్షా ఆసక్తులెందుకు... మనలోని అంతర్గత ఆదిమ నాడులు ఉత్తే...